ముహూర్త విషయము

             ముహూర్తం అనగా కనురెప్ప పాటు సమయం అని అర్ధం. ఈ ముహూర్తమును పంచాంగం ద్వారా నిర్ణయించబడును. పంచాంగం అనగా పంచ అంగములతో కూడుకున్నాటటువంటిది. అవి తిధి, వార, నక్షత్రం, యోగం, కరణం. అసలు ముహూర్తం అనగా కను రెప్ప పాటు సమయం అని ఇంతకముందు చెప్పుకున్నాం. కాళిదాసు మతాను సారం గా వేయి కలువరేకులు ఒకే చోట వరుసగా పేర్చి దానిలో సన్నని బంగారు తీగ గుచ్చితే ఒక పద్మ పత్రంలో దిగే కాలమే ముహూర్తం అని చెప్పబడింది. అటువంటి ముహూర్తం ను తెలుసుకొనుట బ్రహ్మకు అయినా సాధ్యం కాదు.ముహూర్త నిర్ణయమందు జ్యోతిష్కుడు సాక్షీభూతుడు మాత్రమే కాబట్టి ముహూర్త సమయాన్ని ఆయా వ్యక్తులు పూర్వ జన్మ ఫలములు ను అనుసరించి వచ్చుచుండును. ఒక ముహూర్తం నిర్ణయించాలంటే అనేక గ్రహ నక్షత్రాల కాంతి సమూహాలు ఒకే కేంద్రానికి వచ్చు సమయం నిర్ణయించడమే.

ముహూర్తమునకు కావల్సిన నియమములు

1) లగ్నాధి పతి బలవంతుడు అయిఉండాలి.

2) లగ్నాధిపతి స్వక్షేత్ర, ఉచ్చ క్షేత్రములలో లేకపోయినను, మిత్రక్షేత్రమలలో గాని కేంద్ర కోణముల లో గాని ఉండవలయును.

3) కేంద్ర కోణములలో పాపులు ఉండకూడదు.

4) ముహూర్త లగ్నాధి పతి, వారాధి పతి, నక్షత్రాధి పతి ఒకరైనచో ఆ ముహూర్తం చాలా బలమయినది.

5) ఏకవింశతి దోషములను విడిచి ముహూర్తం నిర్ణయించుట చాలా మంచిది.

6) క్షీణ చంద్రుడు ఉన్నప్పుడు ముహూర్తం నిర్ణయించుట దోషము.

7) ఒక ముహూర్తం నిర్ణయించినపుడు కర్త యొక్క నామ,జన్మ నక్షత్రముల రెండిటికి తారాబాలమును చూడవలయును మరియు చంద్రబలమును, పంచరహితమును పరిశీలించవలయును.

ఇంకను చాలా నియమ, నిభందనలు చాలా ఉన్నాయి. కావున మీకు సంభందిత కార్యమునకు కావల్సిన ముహూర్తం ను మీరు పొందాలంటే మీ జన్మ నక్షత్రమును లేదా మీ నామనక్షత్రమును లేదా మీ జన్మ తేదీ, జన్మ సమయం, జన్మ ప్రదేశ వివరములు మాకు తెలియ చేసినచో సరి అయిన ముహూర్తమును తెలుపబడును.