శ్లో; శుక్లాంబరధరమ్ విష్ణుం శశివర్ణం చతుర్భుజం !
ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోప శాంతయే!!
ప్రస్తుతకాలం లో పూజాకార్యక్రమాలు శాస్త్రోక్తంగా ఆచరించాలి అనుకునే వారు ఆచరించ లేక పోతున్నారు.అసలు పూజా కార్యక్రమాలు అంటే ఏమిటి అనే విషయానికి వస్తే పూజా కార్యక్రమాలు వేదముల సారాంశమే.ఈ పూజా కార్యక్రమాలు మానవుని జన్మించిన దగ్గర నుండి గతించే వరకు షోడశ కర్మలు ఆచరించాలి. దీనిలో అంత్యేష్టి షోడశ కర్మ. దీనిని పరిగణన లోకి తీసుకోకుండా ఉంటే పంచదశ కర్మలు అవి
|
|
|
---|
ఈ కార్యక్రమాలన్నియు చతుర్వేదముల సారాంశం. మన ఆచారాలను సాంప్రదాయాలను వదిలి పెట్టి వ్యాపారాల నిమిత్తం,ఉద్యోగాల నిమిత్తం మరియు మన అవసరాల నిమిత్తం వేరే ప్రదేశాలకి వెళ్ల వలసివస్తుంది.అచ్చట మన సాంప్రదాయముల ప్రకారం పూజా కార్యక్రమాలన్నియు ఆచరింప చేయడానికి బ్రాహ్మణోత్తములు సమీపం లో ఉండ జాలరు. మరియు ఉన్నను వారి గురుంచి మీకు పూర్తి గా తెలియదు.మరి ఇలాంటి వారికి ఈ website ఒక సదవకాశం.నిత్యములు,నైమిత్తికములు,స్నాన సంధ్యా నుష్టములు అనెడు కర్మలు ఆచరించుట ప్రతీ వ్యక్తికీ పరమ ధర్మమనియు ముఖ్య కర్తవ్య మనియు వేదాది సమస్త శాస్త్రము లందు చెప్పబడి ఉన్నది . ప్రతీ వ్యక్తి కి మూడు విధముల ఋణములు ఉండును.అవి దేవ ఋణం,ఋషి ఋణము,పితృ ఋణము.
“యత్కృత్వా నృణ్య మాప్నొతి దైవాత్ పై త్ర్యాచ్చ మానుషాత్”
అని చెప్పినట్లు గా నిత్య కర్మలను చక్కగా ఆచరించుట వలన మానవుడు ఈ త్రివిధ ఋణముల నుండి విముక్తుడవును.మానవ జన్మమును సఫల మొనర్చుట కై మానవ మాతృడయిన ప్రతీ వ్యక్తి నిత్య పూజా కార్యక్రమాలను నియామను సారంగా ఆచరించ వలయును. అసలు బ్రాహ్మణుడు అంటే అర్ధం తెలుసుకుందాం
బ్రహ్మ అస్య ఆస్తీతి బ్రాహ్మణః!
బ్రహ్మ- బ్రహ్మ విద్య – వేద విద్య -జ్ఞాన విద్య
అస్య – ఇతనికి
ఆస్తి ఇతి – ఉన్నది కనుక బ్రాహ్మణుడు అగుచున్నాడు.
యజనం – యజ్ఞ చేయుట
యాజనం – యజ్ఞము చేయించుట
అధ్యయనం – వేదము చదువట
అధ్యాపకం – వేదము చెప్పుట
దానము – దానము చేయుట
ప్రతి గ్రహం – దానం తీసుకొనుట
ఈ షట్కర్మములు కలవాడు బ్రాహ్మణుడు.
సదాచారము ,సత్ప్రవర్తన ,పరోప కార బుద్ధి ,సత్యము,సంస్కృతి,సాంప్రదాయము,భక్తి శ్రద్ధలు,వినయ విధేయతలు,ఏక పత్నీ వ్రతము,ధర్మకార్యా సక్తి,ఉపనయన సంస్కారము,సంధ్యా వందనము,నిత్యాగ్ని హవనములు,శాస్త్ర విజ్ఞానము మున్నగు సద్గుణములు కలవారు బ్రాహ్మణులు.బ్రాహ్మణులు అనగా ఒక కులమునకు,ఒక మతమునకు చెందిన వారు కాదు. ఎవరైనా బ్రాహ్మణోత్తమును పొంద వచ్చును.
జన్మనా జాయతే శూద్రః ! కర్మణే జాయతే ద్విజః !
వేదపాటేన విప్రః స్యాత్ ! బ్రహ్మ జ్ఞానేన బ్రాహ్మణః!! (స్కాంద పురాణము )
జన్మించినది మొదలు ఉపనయనము వరకు శూద్రత్వం,ఉపనయన సంస్కారము చేత ద్విజత్వము,వేద అధ్యయనము చేత విప్రత్వము,బ్రహ్మ జ్ఞానము చేత బ్రాహ్మణత్వము వచ్చును.
అవశ్య మను భోక్తవ్యమ్ ! కృతం కర్మ శుభా శుభం !!
నా భుక్తమ్ క్షీయతే కర్మ ! కల్ప కోటి శతైరపి !!
జీవుడు తాను చేసిన పుణ్య పాప కర్మల ఫలాన్ని తప్పకుండా అనుభవించి తీరవలసిందే నని కొన్ని వందల కోట్ల కల్పాల కాలం జరిగిన చేసిన కర్మ అనుభవించ కుండా నశించదని పై శ్లోకం చెబుతుంది . ఇది ఋషి వాక్కు,పరమ ప్రమాణం. జనన మరణాత్మక మయిన ఈ సంసార మహా ప్రవాహం లో పాపము,పుణ్యము అప్రయత్నము గా జరిగి పోతూనే ఉంటాయి. పాపము వలన దుఃఖము,పుణ్యము వలన సుఖము కల్గును.దుఃఖదాయకములగు కర్మలను ఆచరించరాదని, సుఖ దాయకములగు కర్మలను ఆచరించాలని మన మహర్షుల ఉపదేశం. ఈ అంశాలను దృష్టి లో పెట్టుకుని మహర్షులు అనేక ఉపాయాలను సూచించారు.అవి నవగ్రహ హవనం,చండీ హవనం,నవగ్రహ శాంతి, ఇలా ఇత్యాదికములు ఎన్నో పూజా కార్యక్రమములు ఉపదేశించారు.
కావున సమస్త పూజా కార్య క్రమములు గురుంచి సంపూర్తి వివరణ తెలుసుకుని అన్నియు ఆచరించి సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో అందరూ జీవించాలనే అభిప్రాయము తో మేము మీ ముందుకు వచ్చాము.