వాస్తు

                     నిరాకారమయిన భగవంతుని స్వరూపం వాస్తు. నిరాకార స్వరూపానికి ఆకారం ఏర్పరచు కోవటమే గృహాన్ని నిర్మించుకోవటం. ఈ సృష్టి లో వాస్తు పుట్టుక ఏనాటిది అన్నది ఖచ్చితంగా చెప్పలేము. అయితే సృష్టి మొదలు నుండి సృష్టి అంతం వరకు వాస్తు పనిచేయక తప్పదు. వాస్తు అనేది వేద కాలంలో జన్మించింది అని కొందరు చెప్తారు. వాస్తు లో అష్టదిక్పాలకులు, పంచ భూతములు ప్రధానపాత్ర వహిస్తాయి. వీటిని గురించి వేదాలలో, ఇతర ధర్మ శాస్త్రాలలో ఇలా ఉంది. వాస్తు శాస్త్రమును సంపూర్తిగా అధ్యయనం చేసి మనకు దగ్గర్లో అనేక గృహ నిర్మాణాలు గమనిస్తే శాస్త్రం వాస్తవమా ? కాదా ? అనేది అర్ధం అవుతుంది. వాస్తు శాస్త్రం గురుంచి భగవద్గీత లో కూడా ప్రస్తావించడం జరిగింది. వాస్తుని సాకార స్వరూపంలో పూజించాల్సి వస్తే అది శ్రీకృష్ణ భగవానుడే. వాస్తు శాస్త్రంనకు వ్యతిరేఖం గా నిర్మాణాలు చేస్తే ఆర్దిక నష్టం, అవమానములు, హఠాన్మరణము వంటివి సంభవించును. ఇంకా చాలా ఆరిష్టాలు కల్గును. కావున అందరూ వాస్తు శాస్త్రమును పరిపూర్ణం గా తెలిసిన వారిని సంప్రదించి శాస్త్రము ప్రకారంగా గృహ నిర్మాణం చేసుకొనుట శ్రేయ స్కరం. అలా గృహమును నిర్మించుకోవడం వల్ల సకల అరిష్టాలను నివారించుకోవచ్చు.

మానవ జాతికి సంభందించి నంతవరకు చతుర్విధ పురుషార్ధ సాధనకు గృహస్థాశ్రమం ఆధార భూతం. సొంత ఇల్లు లేని గృహస్థుడు చేయు సమస్త శ్రౌత స్మార్త పుణ్య కర్మల ఫలితం ఆ గృహస్థుడు ఎవరి ఇంటివాడు ఆయా కర్మలను ఆచరించు చున్నాడో ఆ గృహ యజమానికి చెందునని శాస్త్రాలు చెబుతున్నాయి. దీనిలో అర్ధం ఏమిటి అంటే ప్రతీ మానవుడు తన శక్తి కి తగ్గట్లు గా గృహ నిర్మాణం చేసుకొనవలయును.

అన్ని రకముల వాస్తు పరిశీలన మరియు వాస్తు ప్లానులకు సంప్రదించగలరు.