నిత్య పూజా కార్యక్రమములు

         గణపతి పూజ, పుణ్యాహ వాచన, జాతక కర్మ, నామకరణం, అన్నప్రాశన, అక్షరాభ్యాసం, కేశ ఖండన, కర్ణ వేధ, ఉపనయనం, వివాహం, శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం, నవగ్రహ శాంతి, జనన నక్షత్ర దోష శాంతి, గృహారంభం, గృహప్రవేశం, నక్షత్ర హవనం, లక్ష్మీ పూజ, మహన్యాసక పూర్వక రుద్రాభి షేకం, సమస్త దేవతా కళ్యాణములు, సంధ్యావందనము, శ్రీ కేదారేశ్వర వ్రతం, శ్రీ లక్ష్మీ వ్రతం, ఉగ్రరధ శాంతి, దత్తత స్వేకారం, మొదలగు కార్యక్రమములు వేద, శాస్త్రముల ప్రకారం గా నిర్వహించబడును.

నిత్య పూజా విధానం

       ఈ పూజా విధానం ప్రతీ రోజు ఆచరించ వచ్చు. ఈ పూజా విధానము లో ప్రతీ మంత్రము అంత్యము లో ఓం శ్రీ గణపతయే నమః అని పలుకడం జరుగుతుంది. మీరు ఏ దేవుడు లేదా ఏ దేవతా పూజా కార్యక్ర మము ఆచరించి నప్పుడు ఆ దేవతా లేదా ఆ దేవుడు పేరు చెప్పుకోవలయును. అలా పూజా కార్యక్రమములో సూచించిన విధముగా ఆచరించ వలయును.

పంచ దశ కర్మలు

1. గర్భాదానం – గర్భాదాన సంస్కార కర్మ గర్భే ఆధానం గర్భధానం! అనగా స్త్రే గర్భము నందు వీర్యమును ఉంచుట ఉంచిన వీర్యము వ్యర్ధము గాకుండా శోణితము తో కలిసి పిండము గా మారవలయును అని అభిలాషించుట.

2. పుంసవనం – పిండము పురుషత్వం పొందవలయును అని అభిలాష తో చేయబడు సంస్కారము. బాలిక చేత గర్భవతి యొక్క కుడి ముక్కులో మర్రి చిగుళ్ళ రసమును పోయించును.

3. సీమంతం – 4 లేక 6 లేక 8 మాసముల యందు చేయబడు గర్భ సంస్కార కర్మ ! పిండము అభివృద్ధి చెందవలయును అని అభిలాష తో అగ్నికి తూర్పు ముఖము గా భార్యను కూర్చుండ పెట్టి దర్భ చుట్ట తో కాను బొమ్మల మధ్యగా కేశ మధ్య సీమంత రేఖను తుడుచును.మరియు ఆమె యొక్క మెడలో ఔదంబుర (మేడి పండ్లు )ఫలమాలను వేయును.

4. జాతక కర్మ – శిశువు జన్మించినప్పుడు చేయబడు సంస్కార కర్మ!  గర్భాంబు జనిత దోష నివృత్తి కొరకు, బ్రహ్మ తేజోభి వృద్ధి కొరకు, లౌకిక వేదిక సర్వ కర్మల యందు ఆవ్యాహత ప్రజ్ఞ, మేధా, జనన సిద్ధి కొరకు కుడి చెవి లో అంగా దంగా త్సంభవసి అను మంత్రము ను జపించుట. తవుడు ఆవాలతో హోమము చేయుట, మొలనూలు కట్టుట చేయుట.

5. నామకరణం – ఇతరులు పిలిచి నప్పుడు తాను పలుకుటకును, తన పేరును చెప్పుకొనుటకును తల్లి తండ్రులు పదకొండవ రోజున నామకరణము చేయుచున్నారు.

6. అన్నప్రాశన – ఈ సంస్కార కర్మ 6 లేక 8 మాసముల యందు మృష్టాన్న ప్రాశన ద్వారా సర్వదా బ్రహ్మ వర్చస్సు యొక్క ఇంద్రియ ఆయురక్షణ ఫల సిద్దికి చేయబడుచున్నది.

7. చౌలం – కేశ ఖండన, కర్ణ వేధ,అక్షరా భ్యాసం ఈ మూడింటిని చౌల కర్మ అంటారు.ఇది ఐదవ మాసము న చేయయలయును.కేశ ఖండన చేయుట వలన మంచి వెంట్రుకులు వచ్చును.కర్ణ వేధ వలన చెవులకు బంగారు పోగులు పెట్టుకొనుచే అలంకారం వచ్చును.

8. ఉపనయనం – ఈ సంస్కార కర్మ వల్ల విజ్ఞానమును, ఆరోగ్యమును పొందుట, ఆయుర్ధాయము పెంచు కొనుట, సద్విద్యను అభ్యసించుట, వినయ విధేయతలు కలిగి పెద్దలను గౌరవించుట, మిత సంచారము, మిత భోజనము, మిత సంభాషణము చేయుట, స్వ సంపాదనతో జీవించు మార్గము ఈ మున్నగు ప్రయోజనములు కల్గును.

9. 10, 12, 13 – వైశ్వకర్మ వ్రతం, ప్రాజాపత్య వ్రతం, సౌమ్య వ్రతం, ఆగ్నేయ వ్రతం, వైశ్వదేవ వ్రతం – వైశ్వకర్మాది పంచ వ్రతములు గురుకులం లో గురు దంపతుల తో కూడి చేయబడును. ఈ వ్రతములను ఆచరించిన పిదప వేదాధ్యయనము చేయవలయును. వీరు వేద అధ్యయన కర్తలు కావున ఆచరించవలయును.

14. స్నాతకం – తలంటు స్నానం చేసి వస్త్ర, ఆభరణాలు స్వీకరించి, బ్రహ్మ చర్య వ్రతము లో లేని – అభ్యంగ స్నానం, మూల్య వస్త్రములు, సువర్ణ తిలకం, సుగంధం, అంజనం, ఆభరణములు, వారణ, ఛత్రము, పాదుకలు, దండము మొదలగు అలంకారములు పొందుటకు అధికారం వచ్చుట.

15. వివాహం – సంస్కారం వలన పరోప కారము చేయుట, బంధు మర్యాదలు చేయుట, యజ్ఞాది పుణ్య కార్యములు చేయుట, సంతానము పొందుట, భోగములు అనుభవించుట, బిడ్డలకు విద్యాబుద్దులు నేర్పుట, పరస్పరం కీర్తి ప్రతిష్టలు ఇనుమడింప చేసికొనుట ఈ మున్నగు ప్రయోజనములు కల్గును.

సమస్త వ్రతములు

         శ్రీ వినాయక వ్రతం, శ్రీ వరలక్ష్మి వ్రతం, శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం, కేదారేశ్వర స్వామి వ్రతం, వేంకటేశ్వర స్వామి వ్రతం, గౌరీ వ్రతం, వనభోజన వ్రతం, క్షీరాబ్ధి ద్వాదశి వ్రతం, వై భవ లక్ష్మి వ్రతం, అనంత పద్మ నాభ వ్రతం, శ్రీ అనఘాష్టమి వ్రతం, శ్రీ లక్ష్మీ కుబేర వ్రతం, ఉమా మహేశ్వర వ్రతం, మంగళ గౌరీ వ్రతం, సరస్వతీ వ్రతం, విశ్వకర్మ వ్రతం, సంతోషి మాత వ్రతం, మహలక్ష్మి వ్రతం, కాత్యాయనీ వ్రతం మొదలయిన సమస్త వ్రతములు మాచేత నిర్వహించబడును.

శాంతి పూజా కార్యక్రమములు

      నక్షత్ర శాంతి, జనన దోష శాంతి, నవగ్రహ శాంతి, అష్ట దిక్పాలక శాంతి, ఉగ్రరధ శాంతి, రుద్ర శాంతి, ఉదక శాంతి, గృహ శాంతి, నరఘోష శాంతి, వాస్తు దోష శాంతి, కుజగ్రహ శాంతి, కాల సర్ప దోష శాంతి, దృష్టి శాంతి మొదలయిన సమస్త శాంతి పూజా కార్యక్రమములు మా చేత నిర్వహించబడును.

జప దానాదులు

               జపము అనగా జప్యతే ఇతి జపః. మంత్రాక్షరములుఉచ్చరించుట లేదా మనస్సులో తలచుట. దీనినే తపస్సు అని కూడా పలుకవచ్చు. పూర్వము ఋషులు, యోగులు, మానవులు అందరూ తపస్సు చేసి భగవంతుడిని ప్రసన్నం చేసుకుని వారి మనోభీష్టములు నెరవేర్చుకునేవారు. అదే విధం గా భక్తి శ్రద్ధల తో జపము ఆచరించడం వల్ల అన్ని సమస్యలు తొలిగిపోయి సుఖ సంతోషాల తో ఆయురారోగ్య ఐశ్వర్యాలతో జీవిస్తారని మనమహర్షులు, యోగులు, పురాణాలు, శాస్త్రాలు సూచించబడ్డాయి.
          శ్రీ గణేశ జపము, పంచాక్షరీ మంత్ర జపము, అష్టాక్షరీ మంత్ర జపము, గాయత్రి మంత్ర జపము, మృత్యుంజయ జపం, నవర్ణావ జపము, గౌరీ జపము, సుదర్శన జపము, మహాలక్ష్మి జపము, సరస్వతి జపము, ఆంజనేయ జపము, నరసింహ జపము

నవగ్రహ జపములు

రవి – 6,000
చంద్రుడు – 10,000
కుజడు – 7,000
బుధుడు – 17,000
గురుడు – 16,000
శుక్రుడు – 20,000
శని – 19,000
రాహువు – 18,000
కేతువు –  7,000
        మొదలయిన సమస్త జపములు బ్రహ్మణోత్తముల చేత వేలల్లో కానీ, లక్షల్లో కానీ, కోట్ల ల్లో గాని మీ అవసరం నిమిత్తం జపములు నిర్వహించి జపతీర్ధం మీకు పంపించ బడును. లేదా మీ గృహము లో కూడా జపము లు మా చే నిర్వహించబడును. మరిన్ని వివరాలకు ఫోన్ ద్వారా కానీ email ద్వారా కానీ సంప్రదించగలరు.

దానములు

        దానము అనగా ఇవ్వడం లేదా ఒక వస్తువుని, మరి ఏ దైనా గాని ఒకరికి ఇచ్చి దాని ప్రతిఫలమును ఆశించకపోవడం.
శాస్త్రముల ప్రకారం నవగ్రహము లకు, దశ దానములు, షోడశ దానములు మా చేత నిర్వహించబడును.

నవగ్రహ దానములు

రవి – గోధుమలు
చంద్రడు – బియ్యం
కుజడు – కందులు
బుధుడు – పెసలు
గురుడు – శనగలు
శుక్రుడు – బొబ్బర్లు
శని – నల్ల నువ్వులు
రాహువు – మినుములు
కేతువు – ఉలవలు

దశ దానములు

     
       గో భూతిల హిరణ్యాజ్య ! వాసో ధాన్య గూఢనిచ !!
        రౌపం లవణమిత్యాహుః ! దశ దానాః ప్రకీర్తి తాః !!

గోదానం, భూదానం, తిల దానం, హిరణ్య దానం, ఆజ్య దానం, వస్త్ర దానం, ధాన్య దానం, గుఢ దానం, రజిత దానం, లవణం దానం.
పై దానములన్నియు బ్రహ్మణోత్తముల చే దానం తీసుకొనబడును.

యజ్ఞ యాగాది క్రతువులు

       శ్రీ గణపతి హవనం, లక్ష్మి గణపతి హవానం, అష్ట లక్ష్మీ హవనం, చండీ హవనం, దుర్గా హవనం, విష్ణు హవనం, మృత్యుంజయ హవనం, అప మృత్యుంజయ హవనం, నవగ్రహ శాంతి హవనం, పురుష సూక్త హవనం, శ్రీ సూక్త హవనం, వాస్తు పురుష హవనం, లక్ష్మీ సుదర్శన హవనం, ఆయుష్య హవనం, శ్రీరామ హవనం, గాయత్రి హవనం, కుబేర హవనం, రుద్ర హవనం, ఋణ విమోచన హవనం, దాంపత్య హవనం, నక్షత్ర హవనం, సర్ప సూక్త హవనం, పుత్ర కామేష్టి హవనం, సరస్వతి హవనం, సమస్త దేవతా హవనములు మా చేత నిర్వహించబడును.

సమస్త పారాయణములు

       శ్రీ లలితా సహస్ర నామ పారాయణం, శ్రీ విష్ణు సహస్ర నామ పారాయణం, సుందరకాండ పారాయణం, హనుమాన్ చాలీసా పారాయణం, గాయత్రి మంత్ర పారాయణం, శ్రీ సాయి చాలీసా పారాయణం, సాయి చరిత్ర పారాయణం, గరుడ పురాణ పారాయణం, మహా భారత పారాయణం, శ్రీ మద్భాగవత్ గీత పారాయణం మొదలయిన పరాయణములు మా చే నిర్వహించబడును.

సమస్త దేవతా ప్రతిష్టా కార్యక్రమములు

    సమస్త దేవతా ప్రతిష్టా కార్యక్రమములు శైవ, వైష్ణవ, వైఖానస, పాంచరాత్ర ఆగమముల ప్రకారం మా చే ప్రతిష్ఠ గావించబడును.

ప్రత్యేక పూజా కార్యక్రమములు

            శ్రీ లలితా సహస్ర నామ కుంకుమార్చన, శ్రీ దుర్గా దేవి కుంకుమార్చన, శ్రీ చండీ హవనం, శ్రీ సంతోషి మాత సహస్ర నామ కుంకుమార్చన, శ్రీ లలితా సహస్ర నామ హవనం, శ్రీ బాలసుబ్రమణ్యేశ్వర స్వామి కళ్యాణం, శ్రీ రాముల వారి కళ్యాణం.